నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మునుగోడు కు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద ప్రమాణ స్వీకారం చేసే ముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లారు.ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం అసెంబ్లీలో జరిగింది.ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల బలి దానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ 10 సంవత్సరాల కాలంలో ఉద్యమకారులను పట్టించు కున్న పాపాన పోలేదని అన్నారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అమర వీరులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పిస్తుందని అన్నారు.తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన కవులు కళాకారులకు ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తుందని అన్నారు.అనంతరం అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నూతన ఎమ్మెల్యేగా తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.