
ప్రతి ఒకరికి కష్టకాలంలో ఆదుకుంటాను అని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు .డొంకేశ్వర్ మండల కేంద్రం లో ఆదివారం బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఈ గెలుపు బీజేపీ కార్యకర్తల గెలుపు అని బీజేపీ లో కార్యకర్తలు డబ్బు కు లొంగని నిబద్దత గల కార్యకర్తలు అని ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో ఏళ్ల పాటు జెండా మోస్తూ ఉన్నారు. రౌడీలు బెదిరంపులు చేసిన అక్రమ కేసులు పెట్టిన పార్టీ లు మరలేరు అని కార్యకర్తలు నిజమైన నాయకులు అని ఇక నుండి కష్టం ఉంటే ముందుంట అని మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం అని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసి ఉండాలని బీజేపీ గెలుపు కోసం పనిచేయాలని అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేందర్,రాష్ట్ర ఓ బి సి మోర్చ ఉపాధ్యక్షుడు మరంపల్లి గంగాధర్,ఎంపీటీసీ లు సంజీవ్, చిన్న రెడ్డి,మహేష్ తదితరులు పాల్గోన్నారు..