పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తాను: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్ 

పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 29మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా పేద వారికి అడ పిల్ల పెళ్లి కోసం ప్రభుత్వం సహాయం చేస్తుంది ప్రతి పేదవాడు ప్రభుత్వ పథకాలు లబ్దిపొందాలని అన్నారు. ప్రభుత్వాలు మారిన పథకాలు ఆగవు అని పథకాల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వకుడదు అని అన్నారు. నియోజకవర్గంలోని నందిపేట్ మండలానికి 57,, మాక్లూర్ మండలానికి 19, ఆర్మూర్ కు 29 చెక్కులను లబ్ధిదారులకు అందజేసినారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గజాన ను, తదితరులు పాల్గొన్నారు.
Spread the love