నవతెలంగాణ – కమ్మర్ పల్లి
జగిత్యాల జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెళ్తూ మండల కేంద్రంలో ఆగిన రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి స్థానిక బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ చెల్గల్ నుండి జగిత్యాల వరకు చేపట్టిన రైతు పాదయాత్ర ను కోరుట్ల కేంద్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ కాసేపు ప్రశాంత్ రెడ్డి మండల కేంద్రంలో ఆగారు. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన 63వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న హోటల్లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి తేనీరు సేవించారు. పార్టీ శ్రేణులతో ముచ్చటిస్తూ మండలంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి, పలువురు నాయకుల ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన జగిత్యాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలి వెళ్లారు.తిరుగు ప్రయాణంలో కమ్మర్ పల్లి సింగిల్ విండో కార్యాలయం వద్ద అల్పాహారం చేశారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, రైతు విభాగం మండల అధ్యక్షులు బద్దం రాజశేఖర్, నాయకులు మల్యాల సుభాష్ గౌడ్, సామా నరేష్, సోమ దశరథ్, తదితరులు పాల్గొన్నారు.