బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, ఏర్గట్ల మండలాలకు చెందిన ఇద్దరు బాధితులకు వైద్య ఖర్చులకోసం ఎల్ఓసి లను రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ మేరకు వేల్పూర్ లోని స్వగృహంలోని కార్యాలయంలో బాధితుల కుటుంబ సభ్యులకు ఆయన ఎల్ఓసి చెక్కులను అందించారు. మోర్తాడ్ మండలం షేట్పల్లి గ్రామానికి చెందిన బబ్బూరి నడిపి లింబన్న ఇటీవల యాక్సిడెంట్ కి గురై రెండు కాళ్ళు కోల్పోయాడు.నిమ్స్ లో కృత్రిమ కాలు ఏర్పాటు సర్జరీ కోసం రూ. లక్ష ఎల్ఓసి మంజూరు చేయించారు. అదేవిధంగా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన కల్లెడ దినేష్ అతి చిన్న వయసులో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్ లో చేరడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కొరకు రూ.లక్ష 50వేల ఎల్ఓసి ఎమ్మెల్యే వేముల మంజూరు చేయించారు. అట్టి ఎల్ఓసి కాపీలను సంబంధిత ఇద్దరు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వేల్పూర్ లో అందజేశారు.చికిత్స కొరకు ఎల్ఓసి లను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేసారు.