ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం

– ఓటర్లకు నిలువ నీడ, త్రాగునీరు ఏర్పాటు

– కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన స్థానిక ఎస్ఐ సందీప్
– శాంతియుత వాతావరణంలో ముగిసిన ఎన్నికలు
నవతెలంగాణ – రాయపర్తి
వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటు వినియోగించుకునే అవకాశం ఉండగా క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. ఉదయం 8 గంటల నుంచి పెద్దఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయత్రం 4 గంటల వరకు 71. 84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలో రెండు పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 140 బూతులు 1247 ఓట్లు ఉండగా పురుషులు 595 ఓట్లలను స్త్రీలు 269 ఓట్లు వేయగా మొత్తం 864 ఓట్లు పోల్ కాగా 141 బూతులో 1163 ఉండగా పురుషులు 543 ఓట్లలను 262 స్త్రీలు  ఓట్లు వేయగా 805  ఓట్లు పోల్ ఐయ్యాయి అని అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూంలకు తరలించారు. మొత్తం 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలవగా చివరికి ఎవరు గెలుస్తారనే చర్చ ప్రజల్లో తీవ్ర స్థాయిలో రేకెత్తింది.
Spread the love