గవర్నర్ తమిళి సై కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

నవతెలంగాణ – హైదరాబాద్
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ… టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులు, చైర్మన్ వారంతట వారే రాజీనామా చేశారు. కాబట్టి రాష్ట్ర గవర్నర్ ఈ విషయంపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నోటిఫికేషన్ల భర్తీ చేయాలంటే కమిషన్ ఉండాలని వెల్లడించారు. నెల రోజులు గడిచిన గవర్నర్ నిర్ణయం తీసుకోలేది.. ఒకవేళ ప్రభుత్వం కమిషన్ సభ్యులను తీసేస్తే.. రాష్ట్రపతిని కలవాలని, కానీ వారంతట వారే రాజీనామా చేశారని నిర్ణయం గవర్నర్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించకపోతే.. నోటిఫికేషన్ల భర్తీకి వెళ్లలేమని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలంటే.. టీఎస్పీఎస్సీ చైర్మన్ ను భర్తీ చేయాలన్నారు. రాజీనామాల నిర్ణయం జాప్యం అవ్వడంతో నిరుద్యోగ యువతలో ఆందోళన కలుగుతుందన్నారు. మరో నెలలో లోక్ సభ ఎన్నికల హడావుడి మార్చి, ఏప్రిల్ వరకు ఉంటుందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే టీఎస్పీఎస్సీ మెంబర్స్ ఫిలప్ కావాలన్నారు.

Spread the love