ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల ఆధ్వర్యంలో పలు కాలనీలలో రోడ్ షో

నవతెలంగాణ- కంటేశ్వర్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్ అభ్యర్థి బీగాల గణేష్ గుప్తా 11వ డివిజన్ లోని 50 క్వార్టార్స్, పూజారి కాలనీ, బహుజన్ కాలనీ, అసద్ బాబా నగర్, బాబాన్ సాబ్ పహాడ్ లో రోడ్ షో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. గత పాలకుల హయం లో అభివృద్ధి కి నోచుకోని నాగారం ప్రాంతాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసాను. నాగారం నుండి సిటీలోకి బిటి రోడ్లు నిర్మించాము. ప్రతి వీధి లో సిసి రోడ్లు నిర్మాణం చేసాము. గతం లో నీటి ఎద్దడి తో నాగారం ప్రజలు బాధపడేవారు. ప్రత్యేక మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం చేసి నాగారం ప్రజల సమస్యను తీర్చాము. బాబాన్ సాబ్ పహాడ్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో అసెంబ్లీలో మాట్లాడి నిధులు తెచ్చి నూతన బ్రిడ్జి నిర్మిస్తున్నాము. నాగారం లో సకల సదుపాయాలతో గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసే సంక్షేమ పథకం లో మానవీయ కోణం ఉంది. అడా బిడ్డ పెండ్లి కోసం అప్పు చేయకూడదని మన ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ షాది ముభారక్ పథకాన్ని అమలు చేస్తున్నారు. గత పాలకుల హయంలో 200 రూ.లు ఉన్న పింఛన్ ని 1000 చేసిండు ఇప్పుడు 5000 రూ.లు చేస్తానని మాటిచ్చారు ప్రతి తల్లి తన పిల్లలకు సన్నబియ్యం తో తినిపించాలని ఆలోచిస్తుంది. ఆ తల్లి కళను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇయ్యాలని నిర్ణయించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి భరోసానిస్తూ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 15 లక్షల వరకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా ట్రీట్ ఇస్తాము. నిరుపేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా 3000 భృతిని అందిస్తాము.మీరు మరోసారి ఆశీర్వదించండి నాగారం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తానని మాటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్ బొడిగం కోమల్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
Spread the love