
ఎమ్మెల్సీ కవితని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు జూలకంటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం చివ్వెంల మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఖమ్మం -సూర్యాపేట రహదారి పై బైఠాయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు జూలకంటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, లాంటి రాజ్యాంగ సంస్థలన్నింటినీ తమ రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి తమ జేబు సంస్థలుగా మార్చుకున్నాయని, గతంలో సీబీఐ, ఈడీ లాంటి కేసులు ఉన్నవారు బీజేపీలో చేరితే, ఉన్న కేసులన్నింటినీ రద్దు చేసి, తమ పార్టీలో చేర్చుకున్నారు అని, రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగదీసుకోవడానికి ఇటువంటి చర్యలకు బీజేపీ పాల్పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ధరావత్ బాబు నాయక్,బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు రావి చెట్టు సత్యం, బి ఆర్ ఎస్ మండల యూత్ ఉపాధ్యక్షులు భూక్య నాగు నాయక్ , అనిల్ నాయక్, పల్లెటి నాగయ్య,ఉట్కూరి సైదులు,దస్తగిరి,సైదులు, ఖాసీం, రాజు,ఎర్పుల నగేష్, అంజి రెడ్డి,మోహన్,మున్నసైదులు,రాములు, నాగేందర్,లచ్చయ్య, బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.