– పాత జోన్ల ప్రకారమే నిర్వహణ
– రేపటినుంచి దరఖాస్తుల స్వీకరణ
– 18,19 తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదు
– 21 నుంచి 23 వరకు బదిలీల ఉత్తర్వులు
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎట్టకేలకు మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న బదిలీలకు మోక్షం లభించింది. ఆన్‌లైన్‌లో వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్ స్కూళ్లను ప్రారంభించిన పదేండ్ల తర్వాత మొదటిసారి ఈ బదిలీలు జరుగుతుండడం గమనార్హం. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, మోడల్ స్కూల్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవసేన సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రాథమిక ఖాళీల వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈనెల 14న ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లను ప్రకటిస్తామని వివరించారు. ఈనెల 16, 17 తేదీల్లో తుది ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్లను విడుదల చేస్తామని తెలిపారు. ఈనెల 18,19 తేదీల్లో బదిలీలకు సంబంధించి వెబ్‌ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 23 వరకు బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తామని వివరించారు. 23 నుంచి 29 వరకు బదిలీల ఉత్తర్వులపై అప్పీళ్లను స్వీకరిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ బదిలీల కోసం ష్ట్ర్‌్‌జూర://రషష్ట్రశీశీశ్రీవసబ.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అయితే రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో మూడు వేల మంది ఉపాధ్యాయులు, 90 మంది ప్రిన్సిపాళ్లు పనిచేస్తున్నారు. కోర్టు కేసు వల్ల వారికి నూతన జోన్ల ప్రకారం ఉపాధ్యాయుల విభజన జరగలేదు. దీంతో పాత జోనల్ విధానం ప్రకారమే బదిలీలు జరుగుతున్నాయి. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం పొందిన తర్వాతే ఈ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.
టీఎస్‌యూటీఎఫ్, ఎంఎస్‌టీఎఫ్ హర్షం
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయడం పట్ల టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి కొండయ్య, ఎస్ మహేష్ హర్షం ప్రకటించారు. పదేండ్లుగా ఒకే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు గత కొన్ని ఏండ్లుగా బదిలీలు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అధికారులకు ప్రాతినిధ్యాలు చేశామని, ఆందోళనలు నిర్వహించామని గుర్తు చేశారు. ఇందుకోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు.
ప్రభుత్వానికి టీఎంఎస్టీఏ కృతజ్ఞతలు
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్ విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కె నగేశ్ కృతజ్ఞతలు తెలిపారు.