దేశ ప్రజలను పక్కదారి పట్టిస్తున్న మోడీ వ్యాఖ్యలు..

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు..ఎస్ వీరయ్య..
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు..చెరుపల్లి సీతారాములు ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
దేశ ప్రజలను భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టిస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన  అతిథిగా హాజరై,  మాట్లాడారు.  దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు మాటలు మాట్లాడుతూ దేశ ప్రజలను తప్పు ధ్రువ పట్టిస్తున్నారని, నిజమైన చరిత్రను కనుమరుగు చేసి తప్పుడు చరిత్రలను దేశ ప్రజలకు బలవంతంగా రుద్దుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.  దేశ ప్రధానిగా ఉండి మతాన్ని మతోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఉపన్యాసాలు చేయడం ప్రజలను రెచ్చగొట్టడం ఏమిటని  ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ నరేంద్ర మోడీ పరిపాలన సాగిందని 9 ఏళ్ల పరిపాలనలో రైతులు, కూలీలు, యువజనులు, విద్యార్థులు, మహిళలు అనేక తరగతుల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కార్మిక చట్టాలను కాలరాయడం, రైతులను పొట్ట కొట్టి నల్ల చట్టాలు తీసుకురావడం, ఆకలి సూచీలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడం, నిరుద్యోగాన్ని పెంచి పోషించడం, పేదరికం రోజురోజుకు పెంచడం, ధరల భారాన్ని అదుపు చేయలేకపోవడం బిజెపి పరిపాలనలోనే సాధ్యమైందని  అన్నారు. సెక్యులరిజాన్ని కాపాడవలసిన ప్రధాని స్థాయిలో ఉండి నరేంద్ర మోడీ చేసిన వాక్యాలు దేశ ప్రజల మధ్యన కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చులు పెట్టే విధంగా అల్లర్లను ప్రేరేపించే విధంగా ఉన్నాయని వారు అన్నారు. నరేంద్ర మోడీ వ్యాఖ్యలు పదాన్ని స్థాయిలో లేవని దేశ ప్రజలు నరేంద్ర మోడీ వాఖ్యలను ఇప్పి కొట్టాలని వారు అన్నారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సీపీఐ(ఎం) గా అనేక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకునే విధంగా మన పని ఉండాలని, నిరంతరం ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆచరణాత్మకమైన ప్రణాళికను రూపొందించుకొని ప్రజా సమస్యలపై గ్రామీణ స్థాయిలో పోరాటాలు, ఆందోళనలు చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సందిగ్ధంలో పడిందని ప్రజా సమస్యలపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి తక్షణం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రణాళిక తయారుచేసి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పరిపాలన సాగించాలని వారు కోరారు. ఈ  సమావేశంలో యాదాద్రి భువనగిరి  జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరు బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, జెల్లెల పెంటయ్య, బబ్బురి పోశెట్టి,బొడ్డుపల్లి వెంకటేష్, బొల్లు యాదగిరి, గంగదేవి సైదులు, పగిల్ల లింగారెడ్డి, దోడ యాదిరెడ్డి,గుంటోజు శ్రీనివాస్ చారి, గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్, గుండు వెంకటనర్సు, దూపటి వెంకటేష్, గాడి శ్రీనివాస్, పోతరాజు జహంగీర్, వేముల భిక్షం, దొంతగాని పెద్దులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Spread the love