
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ని గురువారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సాగర్ పట్టణ అధ్యక్షులు రమావత్ మోహన్ నాయక్, నందికొండ ఒకటో వార్డు కౌన్సిలర్ రమావత్ మంగత నాయక్ హిల్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నందికొండ మున్సిపాలిటీ లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి నందికొండ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను అన్ని పరిష్కరించి నందికొండ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి తెలిపారని అన్నారు.వీరితో పాటు ధన్సింగ్ తండా సర్పంచ్ దూప్ సింగ్ ఉన్నారు.