- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. నేడు నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్-నికోబార్ దీవులకు చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో పది రోజుల్లో(ఈ నెల 26న) కేరళంను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 19 వరకు ఉరుములు, పిడుగులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో ఈ నెల 18 వరకు వేడిగాలులు వీస్తాయని తెలిపింది.
- Advertisement -



