డెంగ్యూను అడ్డుకునే దోమలు

నవతెలంగాణ-హైదరాబాద్ : వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. డెంగ్యూకి కారకమైన దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కూడా ఇదే సూత్రాన్ని శాస్త్రవేత్తలు అనుసరిస్తున్నారు. ఇందుకోసం వోల్‌బాకియా అనే బ్యాక్టీరియా ఉండే ప్రత్యేక దోమలను శాస్త్రవేత్తలు పెంచుతున్నారు. డెంగ్యూ విస్తరిస్తున్న ప్రాంతాల్లో వీటిని భారీ సంఖ్యలో విడుదల చేస్తున్నారు. వీటితో డెంగ్యూ వ్యాప్తిని నిరోధించవచ్చని తేలింది. అంతేకాదు.. ఈ దోమలు.. తమ సంతానంలోకి కూడా ఈ బ్యాక్టీరియాను పంపుతున్నాయి. దీంతో భవిష్యత్తులో డెంగ్యూ వ్యాప్తిని ఇవి అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక దోమల వ్యూహాన్ని గత పదేళ్లుగా కొన్ని దేశాల్లో అమలు చేస్తున్నారు. తాజాగా హోండురస్‌ రాజధాని తెగెసిఅల్పాలో ఈ దోమలను విడుదల చేశారు. రానున్న ఆరు నెలల్లో ఇక్కడ 90 లక్షల వోల్‌బాకియా బ్యాక్టీరియా దోమల విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఈ పరిశోధనపై దృష్టిసారించింది. ఇతర దేశాల్లోనూ ఈ వ్యూహాన్ని అనుసరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Spread the love