పోలీస్‌ భద్రత మధ్య ఈవీఎంల తరలింపు

– ధైర్యంగా ఓటేయండి
– జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి
– ఎన్నికలకు పకడ్బందీ చర్యలు
నవతెలంగాణ – వనపర్తి
రేపు జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఈవీఎంలను పంపిణీ కేంద్రం నుండి జిల్లాలో గల అన్ని పోలింగ్‌ కేంద్రాలకు భారీ భద్రత మధ్య తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, పోలీస్‌ అధికారులు సిబ్బంది అందరికీ భద్రత పరంగా సూచనలు చేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక్కో పోలీస్‌ అధికారిని నియమిస్తూ పంపిణీ కేంద్రం నుండి ఈవీఎంలకు రక్షణగా స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ను పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని ప్రతి పోలింగ్‌ స్టేషన్లో ఒక పోలీసు అధికారి ఉంటారని, ఏటువంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించే లాగున పెద్ద సంఖ్యలో రూట్‌ మొబైల్‌ పార్టీలను నియమించడం జరిగినదని సెక్టార్‌ ఇన్చార్జిలనే కాకుండా ఒక్కో ప్రాంతానికి డీఎస్పీ స్థాయి అధికారులను నియమించినట్లు తెలియజేశారు. అలాగే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో భారీ మొత్తంలో కేంద్ర ఆర్మూడ్‌ బలగాలు స్పెషల్‌ పార్టీ పోలీసుల ద్వారా భారీ భద్రత విధించామని ఎన్నికలకు ఆటంకం కలగకుండా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని ఎవరికి భయపడకుండా ప్రజలందరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Spread the love