
నవతెలంగాణ – మల్హర్ రావు
గత ఐదు సంవత్సరాలు మండలానికి సేవలందించి బదిలీపై వరంగల్ కు వెళ్లిన ఎంపీడీఓ గుండు నరసింహామూర్తి సేవలు అభినందనీయమని మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. చిన్నస్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులతో సోదరబావంతో ఉంటూ సలహాలు,సూచనలు ఇచ్చేవారన్నారు. ఇందుకు ఎంపీడీఓ కు రుణపడి ఉంటామని పలువురు పంచాయతీ కార్యదర్శులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేపట్టిన బిల్లుల మంజూరు, గ్రామాల అభివృద్ధి విషయంలో ఎంపీడీఓ అందించిన సేవలు, సలహాలు గొప్పవని ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచ్ లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో, ప్రజాప్రతినిధులకు జవాబిదారి తనంగా విధులు నిర్వహచిన గొప్ప ఉద్యోగి ఎంపీడీఓ న్నారు. అనంతరం ఎంపీపీ తోపాటు పలువురు పూలమాలలు,శాలువాలు,మేమోంటో లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి అవినాష్,ఏపీఓ హరీష్,పంచాయతీ ఏఈ అశోక్, వళ్లెంకుంట ఎంపీటీసీ ఏనుగు నాగరాని, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ హరిత,కోప్సన్ ఆయూబ్ ఖాన్,పంచాయతీ కార్యదర్శులు, మాజీ సర్పంచ్ లు,ఈజిఎస్,ఎంపీడీఓ సిబ్బంది పాల్గొన్నారు.