టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు ఖరారైంది. పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు.. ఇటీవల టీడీపీలో చేరి మరోసారి ఎంపీ అయ్యారు.

Spread the love