సేయింట్ ఆల్ఫన్సస్ స్కూల్ ను సందర్శించిన ఎంపీ

– విద్యను అభ్యసించిన పాఠశాలలో చామల  సందడి 
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండలోని  తాను పాఠశాల విద్యను అభ్యసించిన సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ ను భువనగిరి పార్లమెంట్ సభ్యులు  చామల్ కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సందర్శించారు. జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొనేందుకు విచ్చే సిన కిరణ్ కుమార్ రెడ్డి తాను చదువుకున్న పాఠశాలను సందర్శించేందుకు విచ్చేయగా పాఠశాల కరస్పాండెంట్ హృదయ్ కుమార్ రెడ్డి  ఎంపి కిరణ్ కుమార్ రెడ్డికి పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. నేను 2వ తరగతి నుండి 8వ తరగతి వరకు క్లాస్ టీచర్ గా పని చేసినటువంటి టీచర్ కేథరిన్, హిందీ టీచర్ గులాం జిలాని ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి  మర్యాదపూర్వకంగా సన్మా నించారు. చిన్ననాటి పాఠశాలలో జరిగిన మధుర అనుభూతులను గుర్తు చేసుకున్నారు. తమ పాఠశా లలో విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థి పార్లమెంటు సభ్యులుగా గెలుపొందడం  గర్వంగా ఉందని పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పాఠశాల యాజమాన్యని  అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love