బదిలీపై వెళ్తున్న అధికారులను సన్మానించిన ఎంపిడిఓ

నవతెలంగాణ-లోకేశ్వరం : మండలంలోని కిష్టాపూర్-సాయిరాజ్, బామ్ని- గంగాధర్, వట్టోలి- రాము, పిప్రి- రాజేందర్, గడ్బందా- రాఘవేందర్ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో పాటు  సీనియర్ అసిస్టెంట్ భూమ్రావ్, అటెండర్ లు విజయ్, సాయన్న, రజినీ బదిలీ పై వెళ్తున్న సందర్భంగా ఎంపిడిఓ సోలమన్ రాజ్ స్థానిక రైతు వేదికలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సూపర్డెంట్ వెంకట రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love