నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ శ్రీనివాస్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సెల్ప్ హెన్యుమరేషన్, ఉపాధి హామీ లేబర్ మొబలైజేషన్, చలివేద్రం ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు త్రాగు పీటీఐ సమస్యలు తలెత్తకుండా గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, పన్నుల వసూలు 100% నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశములో ఎంపీడీవో, ఎంపివో, తహశీల్దార్, నయాభ్ తహసిల్దార్ హేమలత, ఏపీవో తులసిరాం, ఈసీ స్వామి దాస్, టిఏ రవీందర్, ఏఈ హౌసింగ్ తదితరులు పాల్గొన్నారు.
జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీఓ సమీక్షా సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



