నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఐదోవసారి అత్యధిక మెజార్టీతో గెలుపొంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తాను కోయకుంట్ల నాగులమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్థానని శాసనసభ ఎన్నికల ముందు మండలంలోని వళ్లెంకుంట ఎంపీటీసీ సభ్యురాలు ఏనుగు నాగరాని మొక్కుకున్నట్లుగా తెలిపారు. శ్రీదర్ బాబు ఎమ్మెల్యేగా గెలుపొంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బుధవారం నాగులమ్మ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్టుగా ఎంపీటీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, జెడ్పిటిసి అయిత కోమల, కొయ్యుర్ మాజీ ఉప సర్పంచ్ ఏడబ్ల్యుయు సొసైటీ కాటారం సబ్ డివిజన్ మహిళ అధ్యక్షురాలు కొండూరి మమత, కాంగ్రెస్ నాయకులు తిరుమల్, శ్రీనివాస్ రెడ్డి,తోడే లక్ష్మన్ పాల్గొన్నారు.