నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఎన్నికైన వన్నెల దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ను శనివారం శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా శ్రీ భాషిత సుందర్ మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.