Thursday, May 14, 2026
E-PAPER
Homeజాతీయంఖ‌రీఫ్ సీజ‌న్‌లో14 పంట‌ల‌కు ఎంఎస్పీ

ఖ‌రీఫ్ సీజ‌న్‌లో14 పంట‌ల‌కు ఎంఎస్పీ

- Advertisement -

కేంద్ర మంత్రివ‌ర్గం నిర్ణ‌యం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
2026-27 మార్కెటింగ్ సీజ‌న్‌లో 14 పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్పీ)ను పెంచ‌డానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. బుధ‌వారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్‌ ఆయిల్‌ రేట్స్‌, ఇంధన సంరక్షణ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ క్లాసెస్‌, బంగారం కొనుగోళ్ల వాయిదాపై చర్చించినట్టు సమాచారం. అలాగే, ఖరీఫ్‌ సీజన్‌ మద్దతు ధరల నుంచి కోల్‌ గ్యాసిఫికేషన్‌, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయ ఆధునికీకరణ వరకు భారీ కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది.

ఖరీఫ్‌ సీజన్‌లో 14 పంటలకు మద్దతు ధర పెంపు నకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆయా పంటలకు క్వింటాకు పెంచిన ధరలు ఇలా ఉన్నాయి.
కోల్‌ గ్యాసిఫికేషన్‌ పథకానికి రూ.37,500 కోట్లు
దేశంలో బొగ్గు వినియో గాన్ని ఆధునికీకరించేందుకు కోల్‌/లిగ్నైట్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు రూ.37,500 కోట్ల కేటాయింపునకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలి పింది. ఈ ప్రాజెక్టుతో దిగుమతి ఇంధనాల పై ఆధారాన్ని తగ్గిం చడంతో పాటు దేశీయ పరి శ్రమలకు మద్దతు లభించనుంది.
గుజరాత్‌లో సెమీ హైస్పీడ్‌ రైల్వేలైన్‌కు గ్రీన్‌ సిగల్‌
గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ జిల్లాలోని సర్కేజీ – ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్‌ డబుల్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 134 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,667 కోట్లగా పేర్కొంది. 2030-31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది.
పీపీపీ కింద నాగపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయ ఆధునికీకరణ
మహారాష్ట్రలోని నాగపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రయి వేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద ఆధునికీకరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త సదుపాయాలు, విస్తరణ పనులతో విమానాశ్రయ సేవలు మరింత మెరుగుపడనున్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ వివరించారు.

ఒడిసలు – రూ.10,052

వరి (సాధారణ రకం) – రూ.2,441

వరి (గ్రేడ్‌ ఏ) – రూ.2,461

హైబ్రిడ్‌ జొన్నలు – రూ.4,023

మల్దండి జొన్నలు – రూ.4,073

సజ్జలు – రూ. 2,900

రాగులు – రూ.5,205

మొక్కజొన్న – రూ. 2,410

కందులు – రూ. 8,450

పెసర్లు – రూ.8,780

మినుములు – రూ.8,200

పత్తి (మధ్యరకం) – రూ.8,267

పత్తి (లాంగ్‌ రకం) – రూ. 8,667

వేరుశనగ – రూ.7,517

పొద్దుతిరుగుడు – రూ.8,343

సోయాబీన్‌ – రూ.5,708

నువ్వులు – రూ.10,346

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -