నవతెలంగాణ-ధర్మసాగర్
రానున్న రోజులలో ముదిరాజ్ కు ఐక్యంగా పోరాడి అన్ని రంగాల్లో ముందుండాలని మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు. మండల కేంద్రంలో ఎం ఈ పి ఏ టీజీ మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జాతి అభివృద్ది, ఐక్యత కోసం ముదిరాజ్ యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరారు.రానున్న రోజుల్లో ముదిరాజ్ లు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగడం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ముదిరాజులు రాజకీయ రంగాలలో తమ వంతు వాటాను వర్గీకరణలో కేటాయించాలని ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. అనంతరం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల మెపా అద్యక్షులు గా దాసరి రాజ్ కుమార్ ముదిరాజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అద్యక్షులు ఎన్నికైన రాజ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన మెపా రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ధన్యవాదాలు తెపుపుతూ జాతి అభివృద్ది కోసం నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శులు సింగారపు రామ కృష్ణ,దండు చిరంజీవి,నీరటి రాజు,హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్,చెన్నబోయిన సాయి శివ,దాసరి నవీన్, మేడబోయిన మహేందర్, మాచర్ల సుభాష్,సాయి తేజ, అబ్బరబోయిన వెనుగోపాల్ ముదిరాజ్ లతో పాటు కుల బందువులు తదితరులు పాల్గొన్నారు.