బాగేపల్లి గ్రామంలో చిన్నారులకు ముగ్గుల పోటీలు..

– బహుమతులు అందజేసిన సర్పంచ్..
నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో సర్పంచ్ పాముల సాయిలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భర్త భూమేష్, ఉప సర్పంచ్ సుదర్శన్, నరేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Spread the love