బహు భాషా ప్రవీణుడు

Multilingualమీకు ఎన్ని భాషలొచ్చు? మహా అయితే మూడో, నాలుగో భాషలు వచ్చు. అది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? అంటే చెప్పడం కష్టం. తెలంగాణ రాష్ట్రంలో బహుబాషావేత్త అనగానే మనకు తొలుత గుర్తుకు వచ్చేది మన మాజీ ప్రధాని పి.వి.నర్సింహారావే. ఆ తరువాత నలిమెల భాస్కర్‌, ఇటు నల్లగొండలో అయితే నోముల సత్యనారాయణ గుర్తుకు వస్తారు. వీరిలో కూడా పి.వి కే దాదాపు 16 భాషలు వచ్చు. వీరు కాకుండా మరి కొన్ని భాషలు మాట్లాడే వారు ఉండవచ్చు. మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్‌ అక్రమ్‌. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.
తమిళనాడు అభిరామం గ్రామానికి చెందిన అబ్దుల్‌ హమీద్‌, అమీనాల్‌ బేగంల పెద్ద కుమారుడు మహమూద్‌ అక్రమ్‌. తండ్రి ఉద్యోగరీత్యా రకరకాల దేశాలకు వెళ్లేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్‌ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకున్న అక్రమ్‌, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని పెని జిల్లాకు చెందిన మహమూద్‌ భాషలలోకి ప్రయాణం కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే ప్రారంభమైంది. అతని తల్లిదండ్రులు అతనికి ఇంగ్లీష్‌, ప్రాథమిక భాషా నిర్మాణాలను పరిచయం చేశాడు. మహమూద్‌ భాషా నైపుణ్యం చాలా చిన్న వయసులోనే స్పష్టంగా కనిపించింది. ”నేను తరచుగా వివిధ దేశాలకు వెళ్లేవాడిని, నా కొడుకు భాషలపై తీవ్రమైన ఆసక్తిని పెంచుకున్నాడు. అతను ఇంత త్వరగా, అప్రయత్నంగా ఇన్ని భాషలు నేర్చుకుంటాడని నేను ఎప్పుడూ ఊహించలేదు.” అంటాడు తండ్రి. అతని అభిరుచి అతన్ని బహుళ భాషలను అర్థం చేసుకోవడం, పరిపూర్ణం చేయడంలో సహాయపడిన ఆన్‌లైన్‌ భాషా డేటాబేస్‌ అయిన ఓమ్నిగ్లోట్‌ ఎన్‌సైక్లోపీడియా వంటి భాషా వనరులను అన్వేషించేలా చేసింది. మహమూద్‌ అస్సామీ, బెంగాలీ, హిందీ, డోగ్రీ, తమిళం, తెలుగు, ఉర్దూ, నేపాలీ, అరబిక్‌, చైనీస్‌, బలూచి, ఇంగ్లీష్‌, జర్మన్‌, ఫ్రెంచ్‌, హిబ్రూ అనేక ఇతర భాషలను నేర్చుకున్నాడు. అతని అసాధారణ భాషా సామర్థ్యాలు అతనికి విస్తత గుర్తింపును తెచ్చిపెట్టాయి. మహమూద్‌ సాధించిన ఘనత భాషా నిపుణులను ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే నమోదు చేయబడిన చరిత్రలో ఏ వ్యక్తి కూడా ఇంత చిన్న వయస్సులో భాషలపై ఇంత విస్తతమైన పట్టును ప్రదర్శించలేదు. అతని విజయాలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ దష్టిని కూడా ఆకర్షించాయి. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్‌ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్‌, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్‌ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు. 70 మంది భాషా నిపుణులతో పోటీ పడుతూ జర్మనీలో తన మూడవ ప్రపంచ రికార్డును సాధించాడు.
ఒక్క గంటలోనే
10 ఏండ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏండ్లకే 400 భాషలు చదివి, రాసి, టైప్‌ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్‌, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్‌ టాలెంట్‌ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్‌ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.
స్కూల్‌ మానేసి
అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్‌ మానేసి, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అతనికి స్కాలర్‌షిప్‌ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్‌ యూకేలోని ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు.
విజయాలు – రికార్డులు
ఆరు నుండి ఎనిమిది ఏండ్ల మధ్య, భాషా ప్రావీణ్యం కోసం అక్రమ్‌ స్వీయ-ఆధారిత తపన అతన్ని 50 భాషలను నేర్చుకోవడానికి దారితీసింది. ”గతంలో, వివిధ భాషలను నేర్చుకోవడానికి నేను కొన్ని పాఠ్యపుస్తకాలు మరియు ఓమ్నిగ్లాట్‌పై ఆధారపడవలసి వచ్చింది” అని అక్రమ్‌ చెప్పారు. ఓమ్నిగ్లాట్‌ అనేది భాషలను రాయడానికి, చదవడానికి ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా. ఈ ప్రయాణం కేవలం ఎనిమిది సంవత్సరాల వయసులో అతి పిన్న వయస్కుడైన బహుభాషా టైపిస్ట్‌గా అతని మొదటి ప్రపంచ రికార్డుకు దారితీసింది . ”నేను యూట్యూబ్‌లో వివిధ భాషలను టైప్‌ చేస్తూ, చదువుతూ ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసాను. పంజాబ్‌లోని ఒక ప్రపంచ రికార్డు సంస్థ నన్ను ఒక రికార్డును ప్రయత్నించమని ఆహ్వానించింది, దానిని నేను విజయవంతంగా పూర్తి చేసాను” అని అతను గుర్తుచేసుకున్నాడు.
బహుభాషలు
అక్రమ్‌ అస్సామీ, బెంగాలీ, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, మైథిలి, కొంకణి, సంస్కతం, మణిపురి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి భారతీయ భాషలను టైప్‌ చేసే నైపుణ్యం ఉంది. అలాగే అరబిక్‌, అసేన్‌, అఫ్రికాన్స్‌, అల్‌ బనియన్‌, అమాక్ట్‌, అమ్హారిక్‌, అర్మేనియన్‌, అసంటే ట్వీ, అజర్‌బైజానీ, బాలినీస్‌, బలూచి, బౌల్‌, బాష్కిర్‌, బాస్క్‌, బస్సా, బటాకేస్‌, బెలారూసియన్‌, బెంబా, బెంబా, బెటెన్‌, బూసానో, బొసాయిన్‌, బొసాయిన్‌, బ్యోసూనా, బొసూనా, బూసూనా, బాయెచోనో ఎన్‌ ఇ, చిచెవా, చైనీస్‌ సాంప్రదాయ, చైనీస్‌ సింప్లిఫైడ్‌, చియావో, క్రియోల్‌, క్రొయేషియన్‌, చెక్‌, డాగ్బానీ, డానిష్‌, డారి, ధివేహి, డుసున్‌, డచ్‌, తూర్పు ఇనుక్టిటుట్‌, ఇంగ్లీష్‌, ఎస్పెరాంటో, ఎస్టోనియన్‌, ఈవ్‌, ఫాంటే, ఫిజియన్‌, ఫిలిపినో, ఫినో, గాలెర్‌, గాలెర్‌ ఇగ్బో, ఇలోకానో, ఇండోనేషియా, ఇరానియన్‌, ఐరిష్‌, ఇటాలియన్‌, జపనీస్‌, జావానీస్‌, జూలా, కబైల్‌, కట్లాన్‌, కజాఖ్‌, ఖైమర్‌, కికాంబ, కికోంగో, కికుయు, కొరియన్‌, కెపెల్లె, కుర్దిష్‌, కిర్గిజ్‌, లావో, లాటిన్‌, లాటివాన్‌, లింగే, లింగే, లింగాయన్‌, మలేన్‌, మాలె, మలే, మలేన్‌, మాలె, మలే, లేగ్‌ కా, మారనావో, మెండే, నార్వేజియన్‌/ నార్స్క్‌, న్జెమా, ఒరోమో, పాష్టో, పెర్షియన్‌, పోలిష్‌, పోర్చుగీస్‌, పులార్‌, రొమేనియన్‌, రష్యన్‌, సమోవాన్‌, సారాకి, సెర్బియన్‌, సింధీ, సిన్హాలా, స్లోవాక్‌ తజిక్‌ ఓరి, టెమ్నే, థారు, టిబెటన్‌, టిగ్రిన్యా, టోంగాన్‌, టాస్క్‌, టర్కిష్‌, తువలువాన్‌, ఉక్రేనియన్‌, ఉర్దూ, ఉయ్ఘర్‌, ఉజ్బెక్‌, వై, వియత్నామీస్‌, వాలే, వెల్ష్‌, వెస్ట్‌ ఇనుక్తిటున్‌, పశ్చిమ పుంజబి, ఎక్స్‌హౌ, యిద్‌, యోబెర్‌, యిడ్‌ లు మాట్లాడగలడు. రాయగలడు. అందరినీ ఒక గొప్ప ఆశ్చర్యానికి గురిచేసింది.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

Spread the love