నవతెలంగాణ- తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను ములుగు జిల్లా జడ్జి లలిత శివ జ్యోతి సకుటుంబ సపరివారంగా సోమవారం సంక్రాంతి పండగ రోజున వనదేవతలను దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ పగటిద్దరాజు గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి సన్మానించి, అమ్మవారి ప్రసాదం అందించారు. అనంతరం జడ్జి లలిత శివజ్యోతి మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం ఎంతో మహాభాగ్యంగా ఉందని అన్నారు. ఆమె వెంట బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. కాగా తాడ్వాయి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.