Thursday, July 2, 2026
E-PAPER
Homeజాతీయంముంబై మేయర్ రాజీనామా చేయాలి: BMCడిప్యూటీ మేయర్

ముంబై మేయర్ రాజీనామా చేయాలి: BMCడిప్యూటీ మేయర్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబైలో పలు రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్లులన్ని నదులను తలపిస్తున్నాయి. పలు మార్గాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రోజువారి ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. అయితే గురువారం తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ లో పడి ఓ 56 ఏండ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ముంబై వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.

బీజేపీ పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకండా పోయిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బీఎంసీ(Brihanmumbai Municipal Corporation) డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ, మేయర్ రీతూలపై విమర్శలు గుప్పించారు. మ్యాన్ హాల్లో పడి వ్యక్తి మరణానికి బాధ్యత వహించాలని డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ డిమాండ్ చేశారు. ఆమె వెంటనే ఈ ఘటనకు బాధ్యత వహిస్తు మేయర్ పదవీకి రాజీనామా చేయాలన్నారు.

BMC నిర్లక్ష్యం కారణంగా సంభవించిన ప్రాణనష్టానికి తాను కూడా బాధ్యుడినని డిప్యూటీ మేయర్ అంగీకరించారు, అయితే తాను అధికారులను అప్రమత్తం చేశానని నొక్కి చెప్పారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యతను మేయర్, BMC కమిషనర్ అశ్విని భిడేల వహించాలన్నారు. ఈ మేరకు BMC కమిషనర్ కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఘడి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -