మంథని కూరగాయల మార్కెట్ ను సందర్శించిన మున్సిపల్ ఛైర్మన్

నవతెలంగాణ – మంథని
మంథని కూరగాయల మార్కెట్ ను శుక్రవారం మంథని మున్సిపాల్ ఛైర్మన్ పెండ్రు.రమ-సురేష్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి సందర్శించి పరిశీలించారు. వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య,పాలక వర్గ సభ్యులు.ఈ సందర్భంగా వ్యాపారస్తులు కూరగాయలు అమ్మే నిర్వాహకులు వారి సమస్యలను మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.ఉదయం హోల్ సేల్ నిర్వహిస్తున్న కొంతమంది పెద్ద వ్యాపారులు తిరిగి సాయంత్రం వరకు కూరగాయలను దుకాణాలు నిర్వహించడంతో చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.నాన్ వెజ్ మార్కెట్లో సైతం వీధి దీపాలను ఏర్పాటు చేయాలని దుకాణాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు చైర్మన్  దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రమా సురేష్ రెడ్డి సానుకూలంగా స్పందించి మున్సిపల్ చైర్మన్ హోల్సేల్ నిర్వాహకులను పిలిచి మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా నాన్ వెజ్ మార్కెట్లో లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు.మార్కెట్ రోడ్లపై సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారస్తులు వారి దుకాణా లోపలనే సామాన్లు ఉంచుకొని వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య కౌన్సిలర్లు వీకే రవి,లింగయ్య,వేముల లక్ష్మి,గుండా విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీఅధికార ప్రతినిధి ఇనుముల సతీష్,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love