కాంగ్రెస్ లో చేరిన మునుగోడు ఎంపీపీ..

– పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం..
– కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుంది..
– బీజేపీ, బీఆర్ఎస్ నుండి  కాంగ్రెస్ లో చేరేందుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్  బిఆర్ఎస్కు రాజీనామా చేసి ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక క్యాంప్ కార్యాలయంలో తమ అనుచర వర్గంతో కాంగ్రెసులో చేరగా వారికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్  అధికారంలో ఉండి అధికారంలో అనుభవించారే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించింది ఏమీ లేదని మండపడ్డారు . పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలంతా కాంగ్రెస్లో చేరేందుకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని తెలిపారు. ఎంపీపీ తో పాటు కాంగ్రెస్లో చేరిన వారు పాల్వాయి జనియర్ గోవర్ధన్ రెడ్డి, పందుల యాదయ్య, కొమ్ము కృష్ణయ్య, మండల కేంద్రంలోని వివిధ వార్డులకు చెందిన వందమంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు . ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు వేంరెడ్డి జితేందర్ రెడ్డి , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ సర్పంచులు జాల వెంకన్న యాదవ్, తాటికొండ సైదులు, జక్కల శ్రీను యాదవ్, సీనియర్ నాయకులు బుల్ల వెంకన్న , మాజీ ఉపసర్పంచ్ పందుల పవిత్ర శీను తదితరులు ఉన్నారు.
Spread the love