Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి 

బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి 

- Advertisement -

నవతెలంగాణ-కట్టంగూర్
బాలల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు శనివారం అంబటివాగులో బాలల చట్టాలపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ.. బాల్యవివాహాలతో బాలికలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దత్తత, మిషన్ వాత్సల్య పథకం, బాల్యవివాహాల ప్రభావం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు సైదులు, పులకరం  శ్రీను, ఎకుల సుజాత సైదులు, శ్రీరామ్ సంధ్య వీరేశం, కళ్లెం నాగేశ్వరరావు, బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది రేవతి, అశ్విత ఎన్జీవో శోభారాణి,ఝాన్సీ, కవిత అంగన్వాడి టీచర్ సైదమ్మ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -