నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ కార్యవార్గ సమావేశం మండలాధ్యక్షులు తుకారం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, ఆ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..ఎస్ఐఆర్ ఓటర్ సవరణ నమోదు ప్రక్రియ సజావుగా సాగేందుకు కార్యకర్తలు బీఎల్ ఓలకు సహరించాలని తెలిపారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు తుకారాం, మండల జనరల్ సెక్రటరీ ప్రశాంత్ కుమార్, చిన్న ఎక్లర సర్పంచ్ మాధవ్ రావు, అద్వైత్ దేశపాండే, రమేష్ దేశాయి,హన్మాండ్లు,పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



