ఈ కథకి మా నాన్నే స్ఫూర్తి

విరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్‌ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘పెదకాపు-1’. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మీడియాతో మాట్లాడుతూ, ‘1982లో రామారావు పార్టీ పెట్టినప్పుడు మా నాన్న ఊర్లో చాలా క్రియాశీలంగా ఉండేవారు. ఒక కొత్తపార్టీ వస్తుందంటే జీవితాల్లో ఏదో కొత్త మార్పు వస్తుందనే ఆశ అందరిలో ఉంటుంది. అప్పుడు వచ్చిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, కొన్ని సంఘటనల ఆధారంగా ఫిక్షన్‌ని జోడించి చేసిన కథ ఇది. దీనికి స్ఫూర్తి మా నాన్నే. మొదట్లోనే ఈ యూనిక్‌ స్టొరీని రెండు పార్టులు చేయాలనుకున్నాం. విరాట్‌ కర్ణకి ఇది తొలి సినిమా. కొత్తవాళ్ళతో ఈ తరహా జోనర్‌లో సామాన్యుడి పోరాటం చూపించడం ఒక ఛాలెంజ్‌గా ఫీలయ్యా. అనుకోకుండా ఇందులో నేనూ ఓ పాత్రలో నటించాల్సి వచ్చింది. ప్రీమియర్‌ చూస్తున్నపుడు నా పాత్రని బాగా ఎంజారు చేశాను’ అని అన్నారు.

Spread the love