నూతన ఎస్సైగా ననిగంటి శ్రీకాంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ- తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ననిగంటి శ్రీకాంత్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2012 బ్యాచ్ కి చెందిన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి రేగొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి సంప్రదించాలని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.  పోలీస్ సిబ్బంది నూతన ఎస్సై కి శుభాకాంక్షలు తెలియజేశారు.
దేవతలను దర్శించుకున్న నూతన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాడ్వాయి నూతన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. పూజార్లు ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీర సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. అధికారులు పూజారులు శాలువాలు కప్పి, అమ్మవారి ప్రసాదం అందించి ఘనంగా సన్మానించారు. పూజారులు రానా రమేష్, దోబే రమేష్ ఎండోమెంట్ సిబ్బంది మధు, జగదీశ్వర్, శ్యామ్ పూజారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love