గాంధీజీ లో జాతీయ కుష్టు వ్యాధి వ్యతిరేక కార్యక్రమం

నవతెలంగాణ – చండూరు
స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో  శుక్రవారం  జాతీయ కుష్టు వ్యాధి వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కుష్టు వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారామెడికల్ ఆఫీసర్స్ మహమ్మద్ అనీఫ్, చంద్రశేఖర్, చండూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాసరాజు విద్యార్థులతో మాట్లాడుతూ..కుష్టు వ్యాధిగ్రస్తులపై ఎటువంటి వివక్షత చూపకుండా, వారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాలని అన్నారు. ఎవరికైనా చర్మంపై మచ్చలు ఉండి స్పర్శ కోల్పోయినా, వాటిని తాకినప్పుడు నొప్పి తెలియకపోయినా, మచ్చలపై వెంట్రుకలు పెరగకపోయిన వారిని  తొందరగా దగ్గరలో ఉన్న ఏదైనా ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించాలని, కుష్టు వ్యాధిని తొందరగా గ్రహించి మందులు వాడినచో తొందరగా తగ్గుటకు అవకాశం ఉంటుందని, లేనిచో అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉంటుందని తెలిపారు. విద్యార్థులంతా ఈ లక్షణాలను ఇంటి వద్ద తల్లిదండ్రులకు, పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. తదుపరి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.  కోడి  శ్రీనివాసులు, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి, వి.వి. నరసింహారావు, ఏఎన్ఎం సౌజన్య, ఆశా వర్కర్లు నాగమణి, జ్యోతి, సంతోషి, దుర్గా, తురుణి, అంగన్వాడీ టీచర్స్ సునీత, కేదారి, విజయనిర్మల, జగదీశ్వరి, అస్మా బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love