‘నాటో’ యుద్ధోన్మాద విన్యాసాలు!

'NATO' warlike maneuvers!”నిలకడైన రక్షకుడు 2024” అనే పేరుతో ఈ ఏడా ది మే నెల వరకు కొనసాగే 1998 తరువాత అతి పెద్ద సైనిక విన్యాసాలను నాటో కూటమి ప్రారంభించింది. ఇ లాంటి బల ప్రదర్శనలు ఫలానా వారిని ఉద్దేశించి అని ఎక్కడా చెప్పరు గానీ ఏదో ఒక లక్ష్యం లేకుండా జరగవు. దేశా లు గాకపోతే తాము తయారు చేసిన ఆధునిక ఆయుధాల పాటవాన్ని పరీక్షించి ప్రపంచానికి వెల్లడించేందుకు చేస్తా రు. నాటో కూటమి జరుపుతున్న బలప్రదర్శన తమకు ము ప్పు తెచ్చేందుకే అని, ఇప్పటికే ఆయుధాలను తమ సరి హద్దులకు తరలించారని, తాము కూడా తగిన సన్నాహాలు చేసుకుంటున్నామని రష్యా ప్రకటించింది. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న స్వీడన్‌తో స హా 32దేశాలు జరుపుతున్న విన్యా సాలు మూడవ ప్రపంచ యుద్ధాని కి సన్నాహాలు అని కొందరు వర్ణిం చారంటే నిజానికి ఇవి ఒక్క రష్యాకే కాదు, యావత్‌ ప్రపం చానికి సామ్రాజ్యవాదులు తెస్తున్న ముప్పుగా పరిగణిం చాలి. కొద్దిరోజుల్లో ఉక్రెయిన్‌ మీద రష్యా అమలు జరుపు తున్న సైనిక చర్య మూడవ సంవత్సరంలో ప్రవేశిం చనుంది. ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకొని రష్యా ను దెబ్బతీసేందుకు వందల కోట్ల డాలర్లను, ఆయుధాలను పశ్చిమ దేశాలు కుమ్మరిస్తు న్నాయి. అది ఎప్పుడు తెగుతుందో తెలియదు. తమ దేశం లో పుతిన్‌ సర్కార్‌ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నదని రష్యా ను ఉగ్రదేశంగా ప్రకటించాలని ఉక్రెయిన్‌ చేసిన 2017లో చేసిన వినతిని హేగ్‌ నగరంలోని ఐరాస కోర్టు (ఐసిజె) తిర స్కరించింది. వచ్చిన ఆరోపణలపై మాస్కో దర్యాప్తు చేయ టం లేదనే విమర్శ మాత్రమే చేసిం ది. ప్రస్తుతం జరుపుతున్న సైనిక చర్య మీద విచారణ జరిపేదీ లేనిదీ వేరే అంశమని పేర్కొన్నది. ఇప్ప టికే దిక్కుతోచని స్థితిలో ఉన్న పశ్చి మదేశాలు ఈ పరిణామంతో జ నాన్ని ఇంకేమాత్రం తప్పుదారి పట్టించలేవన్నది స్పష్టం. ఉక్రెయి న్‌కు ఎందుకు వందల కోట్ల డాల ర్లను తగలేస్తున్నారని ప్రశ్నించే వారు నాటో కూటమి దేశాల్లో మ రింతగా పెరుగు తారు. ఆ సంక్షో భం ముందుకు తెచ్చిన సమ స్యలతో అనేక దేశాల్లో రైతాంగం ఇప్పటికే వీధులకు ఎక్కుతున్నది.
నాటో కూటమి తమ యుద్ధో న్మాదాన్ని, నేరాలను కప్పి పుచ్చు కొనేందుకు చైనా, రష్యాల నుంచి ప్రపంచానికి ముప్పు ఉం దంటూ ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తైవాన్‌ సమస్యకూ నాటోకూ ఎలాంటి సంబం ధమూ లేదు. అయినప్పటికీ ఈ రోజు ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసింది రేపు తైవాన్‌ మీద చైనా అదే పని చేయ వచ్చంటూ నాటో అధిపతి స్టోల్టెన్‌బర్గ్‌ తాజాగా అమెరికా పర్యటనలో లంకెపెట్టటం కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు. నాటోతో చేతులు కలిపి తమ ముంగిటకు మిలిటరీ ని తెచ్చి ముప్పు తలపెడుతున్నదనే కారణంతోనే రష్యా మిలిటరీ చర్యకు పూనుకుంది. తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమని, రెండు చైనాలు లేవని ఐరాసతో పాటు అన్ని దేశాలూ గుర్తించాయి. విలీనానికి తగిన సమయం రాలేదని, బలవంతంగా విలీనం చేసుకుంటే సహించ బోమని పశ్చిమ దేశాలు ప్రకటించటమే కాదు, తైవాన్‌లో ఉన్న తిరుగుబాటు ప్రభుత్వానికి మిలిటరీ సాయం చేస్తు న్నాయి. అయినప్పటికీ గడచిన ఏడుదశాబ్దాలుగా చైనా ఎలాంటి బలప్రయోగానికీ పూనుకోలేదు.
ప్రచ్చన్న యుద్ధం ముగిసిందని, తామే విజేతలమని అమెరికా ప్రకటించుకున్న తరువాత జరుపుతున్న అతి పెద్ద నాటో సైనిక విన్యాసాల్లో వివిధ దేశాల నుంచి 90వేల మంది మిలిటరీతో పాటు యాభైకి పైగా విమానవాహక యుద్ధ నౌకల మొదలు డిస్ట్రాయర్లు, ఎనభైకి పైగా ఫైటర్‌ జెట్‌లు, హెలికాప్టర్లు, డ్రోన్లు, 133 టాంక్‌లతో సహా పద కొండువందల వరకు మిలిటరీ వాహనాలు పా ల్గొంటున్నాయి. తమ బల ప్రదర్శనను సమర్ధిం చుకొనేందుకు, ఐరోపా జనాన్ని తప్పుదారి పట్టించుకొనేందుకు, భయాన్ని సృష్టించేందుకు అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉద్రిక్త లను మరింతగా పెంచేందుకు వ్లదిమిర్‌ ఒక పథకాన్ని రూపొందించాడని, దాని ప్రకారం వచ్చే ఏడాది నాటో-రష్యాకు చెందిన ఐదు లక్షల మంది సైనికులు తలపడతారనే అంచ నాతో కూడిన ఒక పథకం లీకైందంటూ ప్రచా రదాడి ప్రారంభించారు. దానిలో రష్యా ఏయే దేశాల మీద దాడికి పథకాలు వేస్తున్నదో కూడా వివరాల మాప్‌ కూడా ఉందని ఆరోపించారు. రష్యాను ఎలా ఎదుర్కోవాలంటూ దశాబ్దాల తరబడి రూపొందించిన వివిధ పథకాలతో తమ సత్తా ఇది అని ప్రపంచాన్ని బెదిరిం చేందుకే నాటో విన్యాసాలు అన్నది స్పష్టం.ఈ బెదిరింపులకు లొంగేదేశాలేవీ లేదని తెలిసి నప్పటికీ భయాన్ని సృష్టించి సొమ్ము చేసుకొనే ఈ దుష్ట క్రీడకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతిశక్తులు జనాన్ని సమీకరించి ఒత్తిడి తేవాలి.

Spread the love