
చెరువుల్లో మట్టి దందా..అనుమతులు లేకున్నా తవ్వకాలు,మండలంలో రెచ్చిపోతోతున్న మట్టి మాఫియా..వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్న చెరువు మట్టి వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు పోపలాలు ఇండ్ల మధ్యలో ఇటుక బట్టీల నిర్వహణ మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు లేకుండా మట్టి తవ్వి విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు.నవతెలంగాణ లో పెద్దవూర నుంచి వచ్చిన కథనానికి కలెక్టర్ హరి చందన ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ ఏడీ జాకబ్,ఏజీ బాలు మంగళవారం నాయినవాణికుంట చెరువులో తరలించిన మట్టి గుంటలు, అలాగే అనుమతి లేకుండా చెరువులో తీసిన బావులను పరిశీలించారు. ఈసందర్బంగా జిల్లా మైనింగ్ ఏడీ జాకబ్ మాట్లాడుతూ అనుమతి లేకుండా మట్టిని తరలించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మట్టిని ఎక్కడి అయితే తరలించారో పరిశీలించి అక్కడీ మట్టిని పంజానామా నిర్వహిస్తామన్నారు.