సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డాక్టర్ రమేష్ చంద్ర

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (CHC)జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త (DCHS)డాక్టర్ రమేష్ చంద్ర మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు .అదేవిధంగా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది .జూన్ మొదటి వారంలో కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేయడానికి కావలసిన అన్ని పరికరాలు మరియు వసతుల గురించి ఆరా తీయడం జరిగింది. ఎండాకాలం దృశ్య సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రికి వైద్యాధికారులను, తగిన సిబ్బందిని నియమించడానికి కమిషనర్ కు సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ  సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాత్వరలోనే ఆసుపత్రికి వైద్యాధికారులు, తగిన సిబ్బందిని నియమించడానికి కమిషనర్ కు సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రమాకాంత్, డాక్టర్ శివలీల, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు, స్టాఫ్ నర్స్, ఉప్పాత్, వెంకటమ్మ, నజీర్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love