అనుమతి లేకుండా అక్రమ వెంచర్లు..

– ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

నవతెలంగాణ – ఉప్పునుంతల 

వ్యవసాయ భూములను నివాస ప్రాంతాలుగా మార్చడం కోసం నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అనధికార వెంచర్లపై కఠిన చర్యలు తీసుకునే నాదుడే లేకపోవడంతో ఒక వెంచర్ పాతిక ప్లాట్లుగా నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్ (పి. జి)గ్రామంలో బీటీ రోడ్డు పక్కన నివాస గృహాల మధ్యలో ఉన్న ఒక ఎకరా 20 గుంటల వ్యవసాయ భూమిలో రాళ్లు పాతి పెయింట్ వేసి క్రమ సంఖ్య నెంబర్లు వేసి సెటర్ బిట్లు, ప్లాట్లు, రోడ్లు వదిలి రియల్ దందా కొనసాగుతోంది. ప్లాట్ల యజమాని గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం అగ్రికల్చర్ భూములను నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్చకుండానే ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శలు ఎల్లువెత్తుతున్నాయి. ప్లాట్లు కొనుగోలుదారులకు విక్రయించి ఒక కుంట రెండు కుంటల చొప్పున ధరణిలో పట్టా చేస్తామన్నట్లు గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతోనే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం మూలంగా ప్రభుత్వ ఆదాయానికి తీవ్ర గండి పడుతుంది అనుమతులు లేని వెంచర్లపై అధికారులు కోరడ ఝులిపిస్తూనే అమాయకులు వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంది. అప్రమత్తమైన గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంచర్ సందర్శించి ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసిన వెంచర్ యజమానులకు నోటీసులు ఇచ్చారు.
లక్ష్మాపుర్ (పి.జి) గ్రామ పరిధిలో వెంచర్ ఏర్పాటు చేసిండ్రు వాస్తవమే గ్రామపంచాయతీని ఎలాంటి అనుమతులు కోరలేదు. గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా లే-అవుట్ నిర్మాణం చేపట్టారు. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామపంచాయతీ అనుమతి లేకుండా లే-అవుట్లు చేయడం చట్ట విరుద్ధం కనుక వెంచర్ యజమానులకు గ్రామపంచాయతీ నుండి నోటీసులు ఇవ్వడం జరిగింది. – లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, నరసింహ.
వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ కి మార్చుకొని డీటీసీపీ పర్మిషన్ పొంది ఉండాలి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇండ్ల నిర్మాణాలు చేపట్టరాదు. ధరణి రిజిస్ట్రేషన్ 5 గుంటలు పైన ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ ఒక గుంట ధరణిలో రిజిస్ట్రేషన్ కొరకు వస్తే ల్యాండ్ సైటును రెవెన్యూ నుంచి సందర్శించి భూమి రిజిస్ట్రేషన్ కు అర్హులు అయితే రిజిస్ట్రేషన్ చేస్తాం, నిబంధనలకు విరుద్ధమైతే రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేస్తాం – ఉప్పునుంతల తాహసిల్దార్, శ్రీకాంత్.
Spread the love