నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు

నవతెలంగాణ – ఉప్పునుంతల

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో యం ఎన్ జి వైన్స్ నిర్వహణ కొనసాగుతున్న వైన్ షాప్ నుండి పరిమితికి మించి నిబంధనలకు విరుద్ధంగా బల్క్ గా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. బుధవారం వైన్ షాపు మందు ట్రాలీ ఆటోలో పట్టపగలే దాదాపుగా 80 నుంచి 100 మద్యం కాటన్లతో ఉప్పునుంతల మండల కేంద్రం నుండి వేరే ప్రాంతమైన అచ్చంపేట మండలం పరిధిలోని గ్రామాలకు తరలిస్తూ రవాణా చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్స్ లపై తనకీలు, పర్యవేక్షణ లేనట్లుగా తెలుస్తోంది. వైన్స్ ల నుండి అమ్మకాలు జరిపే నిర్వాహకులకు, మద్యం తరలిస్తున్న వారికి ఎక్సైజ్ నియమ నిబంధనలు ఏమీ లేనట్లుగా ఉన్నట్లు ఉంది. మద్యం పెద్ద మొత్తన అక్రమంగా తరలిస్తున్న అక్రమ రవాణాపై ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నవతెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారిని చరవాణిలో వివరణ కోరగా .. స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారి సీఐ నియమ నిబంధనల ప్రకారం వైన్స్ నిర్వాహకులు ఒక వ్యక్తి కి గాను 12 మద్యం సీసాలు అమ్మవచ్చు పరిమితికి మించి అమ్మకాలు జరిపినట్లయితే తెలుసుకొని వైన్స్ ను పరిశీలించి బల్కు సేల్ అమ్మకాలు కొనసాగినట్లయితే నిర్ధారణ రుజువైతే వైన్స్ పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం – అబ్కారీ శాఖ తెలకపల్లి సిఐ, రమణయ్య
Spread the love