అక్రమంగా ట్రాక్టర్లతో మట్టి తరలింపు

– పట్టపగలు వందలాది ట్రిప్పులు

– వార్త సేకరించిన విలేఖరితో ఫోన్లో మితిమీరిన మాటలు
– ఇంటికొచ్చి ఒక్క ఫోటో పేపర్లో రావోద్దని వార్నింగ్ ఇచ్చిన ఓ ట్రాక్టర్ యజమాని
– దొరికినప్పుడే దోచేసుకుందాం అన్నట్లు దాబా యజమాని తీరు..

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలం రాయిచెడు, తాడూరు గ్రామాల పరిధిలో ఉన్న వ్యవసాయ పొలలో కే ఎల్ ఐ కెనాల్ ఎక్స్టెన్షన్ కాల్వ పొడగింపు  కొనసాగుతున్న ఇటీవల తవ్విన కాల్వ మట్టిని జెసిబి, పదుల సంఖ్యలో ట్రాక్టర్ల సాయంతో ఇష్టానుసారంగా శ్రీశైలం హైదరాబాద్ హైవే కి ఆనుకొని ఉన్న అచ్చంపేట మండల పరిధి శివారులో ఉన్న శ్రీ సాయి దాబా చుట్టుపక్కల మట్టిని లెవలింగ్ చదునుగా చేస్తూ అవసరాల కొరకు 5, 10 రోజుల నుండి తరలిస్తూ ఒక ట్రాక్టర్ మట్టి ట్రిప్పుకు 500 రూపాయల చొప్పున చెల్లిస్తూ విలువైన మట్టిని సొమ్ము చేసుకుంటున్నారు. కాల్వ తవ్విన మట్టి పై కొందరు కన్ను వేసి మట్టి దోపిడికి కాల్వ కట్టలు బలహీనమవుతున్నాయి. అయినా అధికారులు ఎవరూ వీరిని నిలువరించే సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు వందలాది మట్టి ట్రాక్టర్లు ఓవర్ లోడుతో గ్రామాల మీదిగా వెళుతుండడంతో గ్రామల ప్రజలు, వాహనదారులకు దుమ్ము ధూళి ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందని పలువురి నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ పొలంలో కాలువ ముంపుకు గురైన రైతులు కాల్వ మట్టి కట్టలు తరలించి వ్యవసాయ సాగుకు విస్తీర్ణం పెరుగుతుందని అనే ఉద్దేశంతో మట్టిని ఇక్కడి నుంచి తరలిస్తున్నామని మా పొలం లో నుంచి వెళ్లిన కాలువ మట్టి మా ఇష్టం అంటూ కాల్వ తవ్వకాలకు పైసలు చెల్లించకుండానే కాల్వ పొడగింపు పనులు జరిపిండ్రు పైసలు రానందుకు ఇదే ఉద్దేశ్యంగా పేర్కొంటూ మా పొలం మట్టి మేము మట్టిని తరలిస్తున్నాము అని రైతులు తెలుపుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు కాల్వ మట్టిని రవాణాగా ఇతర ప్రాంతాలకు తరలించవద్దని కాల్వ తవ్విన మట్టిని కాల్వ నిర్మాణానికి ఉపయోగపడుతుందని, తవ్వకాలలో జరిపిన మట్టి రాయి కూడా కాల్వకు ఉపయోగపడుతుందని ఇరిగేషన్ డి ఈ మాణిక్ ప్రభు తెలిపారు. కాల్వ మట్టి తరలించకుండా సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి మట్టి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపడతామని శనివారం చరవాణిలో సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
Spread the love