ఉపాధి కూలీల ట్రాక్టర్ బోల్తా..15 మందికి గాయాలు

– పరామర్శిచిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

నవతెలంగాణ – ఉప్పునుంతల

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు ఎల్. దేశ్యా నాయక్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు చింతల ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ సహాయ కార్యదర్శి చింతల నాగరాజు, శివ రాములు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఉపాధి కూలీలను పరామర్శించి ఉపాధి కూలీలకు మెరుగైన వైద్యంతో పాటు, బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని కాంసానిపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఉపాధి కూలీలతో వెళ్లి ఉపాధి పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్లో 18 మంది మహిళలు, పురుషులు ఉపాధి కూలీలు ఉండగా ముగ్గురు క్షేమంగా బయటపడగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంజాన్ పర్వదిన పండుగ నాడు గురువారం 11 గంటలకు చోటు చేసుకుంది. అని స్థానికులు గ్రామస్తులు వివరాల ప్రకారం.. ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామ పరిధిలో ఉపాధి హమీ కూలీల పనులకు అదే గ్రామానికి చెందిన గడ్డం పద్మ వ్యవసాయ పొలంలో లేవలిగ్ పనులు చేసి ముగించుకొని తిరిగి గ్రామానికి  వస్తున్న క్రమంలో ట్రాక్టర్ యజమాని కొట్టే ఆంజనేయులు ట్రాక్టర్ నడుపుతుండగా ఒక్కసారిగా బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. అనంతరం గాయాల పాలైన ఉపాధి కూలీలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గాయాల పాలైన ఉపాధి కూలీలను పరామర్శిచారు డాక్టర్ వృత్తిగా స్వయంగా ఉపాధి కూలీలకు వైద్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే త పాటు ఉప్పునుంతల మండల అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, ఎంపీపీ తిప్పర్తి అరుణ నరసింహారెడ్డి, మోపతయ్య, మండలా ఆధికారి ఎంపీ ఓ, నారాయణ, టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రాజేష్ బాధితులను పరామర్శిచారు. విషయం తెలుసుకున్న ఉపాధి కూలీలా కుటుంబ సభ్యులు ఉటావుటిన పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాధితులను పరామర్శించారు. గాయాల పాలైన ఉపాధి కూలీలూ స్కానింగ్ ఎక్స్ రేకు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ఉపాధి కూలీలు మెరుగైన పూర్తి వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గాయపడిన వారూ.. పాతుకుల వెంకటమ్మ, మాచర్ల జంగమ్మ, కాంపల్లి నిరంజనమ్మ, మాచర్ల పార్వతమ్మ, మాచర్ల జంగయ్య, కలమండల లక్ష్మి, చింతల లక్ష్మమ్మ, కాంపల్లి శంకరయ్య, ఎల్లపాకుల జ్యోతి, కలమండల కిష్టయ్య, కుందేటి చిట్టెమ్మ, కుందేటి చిట్టెమ్మ, కలమండలి మణెమ్మ, కొట్టే అలివేల, కలమండలి కృష్ణవేణి ఉపాధి పనులు ముగించుకొని వస్తుండగా గాయపడిన కూలీలు, రంజాన్ పర్వదినా సందర్భంగా ఉపాధి కూలీలతో పని చేపించడం ఏంటి అని ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు సంబంధిత శాఖ అధికారులను తీవ్రంగా ఖండిస్తున్నారు.

రైతు గడ్డం పద్మ వ్యవసాయ పొలంలో లెవలింగ్ పనులు ముగించుకొని వస్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి గాయాలు అయినట్లు తెలిసింది. నేను అందుబాటులో లేను నేను ఇంతక ముందు కూడా ట్రాక్టర్ల వెళ్ళవద్దు అని సూచించా ఉపాధి కూలీలు దగ్గర సమీపంలో పనులు కల్పిస్తాం దూరం వెళ్లవద్దు అని ముందే చెప్పాం ఆదివారం తప్ప మిగతా రోజులు ఉపాధి కూలీలు పనిచేసుకోవచ్చు. ఉపాధి పనులకు వచ్చేవారిని మేము వద్దు అననికే రాదు రంజాన్ పండుగ సందర్భంగా కొందరు మాత్రమే పండుగ నిర్వహించుకుంటారు. మిగతావారు ఊరకనే ఉంటారు కాబట్టి పనులకు వెళ్లి చేసుకోవచ్చు. మండల పరిధిలో మెడికల్ రి మెంబర్స్ అమౌంటు రెండువేల వరకే ఉంటుంది. ఉపాధి కూలీల వైద్యం ఖర్చు ఎక్కువైతే బిల్లులు ఉన్నత అధికారికి డిఆర్డిఓ దృష్టికి తీసుకెళ్తాం కంసానిపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ గతంలో సస్పెండ్ అయ్యింది. వారు లేకపోవడం కూడా మాకు ఇబ్బందిగా ఉంది టెక్నికల్ అసిస్టెంట్ దగ్గర ఉండే పనులను చూసుకుంటారు. నేను వారానికి మూడుసార్లు వెళుతుంటాను ఈ ప్రమాదం జరగడం మండలంలో ఇదే మొదటిసారి – ఏపీవో, సుదర్శన్ గౌడ్ మేము రోజు వెళ్లినట్లే ఉపాధి కూలీ పనులకు వెళ్తున్నాం ట్రాక్టర్లో ఉపాధి పనులకు వెళ్లి తిరిగి మళ్లీ ట్రాక్టర్లో వస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది నాకు ఎడమ చెయ్యి బలమైన గాయం ఏర్పడింది. చెయ్యి స్కానింగ్ తీయాలంటే బయటికి వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ తీపించుకున్నాం. అధికారులు ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో వైద్యం అందించి కూలి నాలి చేసుకునే మాకు ఆర్థిక సాయం ప్రకటించి ఆదుకోవాలి. చేతి కుదురుకోకపోతే బతికేది ఎట్లా – మాచర్ల చంద్రయ్య, ఉపాధి కూలీ, కంసానిపల్లి గ్రామం.
Spread the love