బలరామ్ నాయక్ ను అధిక మెజారిటీతో గెలిపించాలి

– పైడాకుల అశోక్ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
నవతెలంగాణ – గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీతక్క ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు, కావాలని కొందరు బి.ఆర్.ఎస్.పార్టీ గుండాలు సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని, సీతక్క  మచ్చ లేని నాయకురాలు అని, గత ఇరవై ఏండ్లలో ఒక్క అవినీతి మచ్చ లేని నాయకురాలు అని అన్నారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ బాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్  గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక కార్యకర్త పని చేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అలాగే 25.04.2024 గురువారం రోజున ఉదయం 10:30 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్ యందు ములుగు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనైనది.
ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క , మహాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్  విచ్చేయుచున్నారు. కావున మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరయి సమావేశాన్ని విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, మండల ఇంచార్జీలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి,  మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, INTUC జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాశం మాధవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెండేం శ్రీకాంత్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులుగుజ్జు వెంకన్న, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, సూదిరెడ్డి జయమ్మ, జంపాల చంద్రశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు చింత క్రాంతి, మద్దాల నాగమణి, పడిదల సాంబయ్య, భూక్యా రాజు, సూడి సత్తిరెడ్డి, ఎంపీటీసీ చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, భూక్యా సారయ్య, తండ కృష్ణ మరియు మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
Spread the love