Tuesday, May 12, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ ప‌రీక్ష ర‌ద్దు..ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌లు

నీట్ ప‌రీక్ష ర‌ద్దు..ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌లు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్‌లో పేప‌ర్ లీకేజీ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ఈనెల 3న నిర్వ‌హించిన‌ నీట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ విద్యార్థి సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. ఢిల్లీలోని శాస్త్రీ భ‌వ‌న్ ఎదుట NSUI విద్యార్థి సంఘం నాయ‌కులు ధ‌ర్నా చేప‌ట్టారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయని మండిప‌డ్డాయి. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆందోళ‌న‌కారుల‌ను బారికేడ్ల‌ల‌తో అడ్డ‌గించారు.

అదే విధంగా నీట్ పరీక్ష ర‌ద్దుపై ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ ప‌దేండ్ల పాల‌న‌లో దాదాపు 89 పేప‌ర్లు ర‌ద్దు అయ్యాయి. 48 సార్లు రీఎగ్జామ్ పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ ఏడాది నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష‌కు 48 గంట‌ల ముందే సోష‌ల్ మీడియా వాట్సాప్ వేదిక‌గా ప్ర‌శ్న‌లు షేర్ చేయ‌బ‌డ్డాయ‌ని తెలియ‌జేశారు. నీట్ రాసినా 22ల‌క్ష‌ల మంది విద్యార్థులు రాత్రిబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి చ‌దువుతే..పేప‌ర్ లీక్‌తో వారి క‌ష్టం వృథ్ధా అయింద‌ని ఆందోళ‌న‌వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా పేప‌ర్ లీకేజ్‌లు ఇది మొద‌టి సారి కాద‌ని..ప‌దేండ్ల‌లో దాదాపు 89 పేప‌ర్లు ర‌ద్దు, 48 సార్లు రీఎగ్జామ్ పెట్టార‌ని ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -