చికెన్‌ బిర్యానీలో ప్లాస్టిక్‌ కవర్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌ :  హైదరాబాద్‌ మహానగరం పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది చార్మినార్‌. ఆ తర్వాత బిర్యాని. అలాంటి బిర్యానీను ఈ మధ్యకాలంలో కొందరు రెస్టారెంట్‌ యజమానులు పురుగులు పట్టిన ఆహారపదార్థాలతో, అలాగే చెడిపోయిన కూరగాయలతో తయారు చేస్తూ ప్రజలకు అందిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి స్విగ్గి ద్వారా చికెన్‌ బిర్యానీని ఆర్డర్‌ చేయగా అందులో అతనికి ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్‌ కవర్‌ ను అందుకున్నాడు. హైదరాబాద్‌ మహా నగరంలోని మణికొండ ప్రాంతంలో ఉన్న మెహిఫిల్‌ రెస్టారెంట్‌ నుండి ఓ వ్యక్తి స్విగ్గి ద్వారా చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసుకున్నాడు. అలా ఆర్డర్‌ చేసుకున్న అనంతరం అతనికి బిర్యాని అందుకున్నాడు. అలా వచ్చిన బిర్యాని తిందామని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. దీని కారణం అతడు అందుకున్న బిర్యానిలో మసాలా ప్లాస్టిక్‌ కవర్‌ తో కూడిన బిర్యాని చూడడమే. దీంతో తనకు జరిగిన సంఘటనకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఆ వ్యక్తి సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త వైరల్‌ గా మారంది.

Spread the love