కొండమల్లేపల్లిలో పోచంపల్లి బ్యాంక్ నూతన శాఖ ప్రారంభo 

నవతెలంగాణ – మల్లేపల్లి 
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని విష్ణు షాపింగ్ మాల్ లో ఆదివారం పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్నాటి బాలసుబ్రమణ్యం కొండమల్లేపల్లి పోచంపల్లి బ్యాంక్ బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆర్బిఐ అనుమతితో బ్యాంకు నిబంధనలు పాటిస్తూ పోచంపల్లి బ్యాంక్ 1997లో పోచంపల్లి గ్రామంలో నూతనంగా ప్రారంభించబడిందని అంచలంచెలుగా ఎదుగుతూ పోచంపల్లి బ్యాంకు ప్రారంభించినప్పుడు 6,25,000 షేర్ క్యాపిటల్ గా ప్రారంభించి ప్రస్తుతం 8000 మంది షేర్ హోల్డర్స్ ఏడు కోట్ల షేర్ క్యాపిటల్ గా సుమారు లక్ష మంది ఖాతాదారులు ఉన్నారని మొత్తం వ్యాపారం 330 కోట్లతో ముందుకు సాగుతోందని మొత్తంగా పదవ శాఖను కొండమల్లేపల్లిలో ప్రారంభించడం శుభ పరిణామం ఉన్నారు పోచంపల్లి బ్యాంకులో బంగారు ఆభరణములపై రుణాలు, వ్యాపార అభివృద్ధికి రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం, హౌసింగ్ లోన్స్, రైతులకు క్రాప్ లోన్స్, ఆల్ వెహికిల్ లోన్స్ పొందే అవకాశం ఉందన్నారు పోచంపల్లి బ్యాంక్ సీఈవో సీతా శ్రీనివాస్, ఇతర బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది, ప్రస్తుత పాలకమండలి, వ్యవస్థాపక మండలి, ఖాతాదారులు, వాటాదారులు, శ్రేయోభిలాషుల సహకారంతో పోచంపల్లి బ్యాంకు సేవలు మరింతగా విస్తృత పరుస్తామన్నారు పోచంపల్లి బ్యాంక్ జాతీయ స్థాయిలో ఎన్నో ఉత్తమ బ్యాంక్ అవార్డులను పొందిందన న్నారు. అతి త్వరలో 4 నూతన శాఖలు ప్రారంభిస్తామని తెలిపారు కొండమల్లేపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ఉద్యోగ,వ్యాపారస్తులు పోచంపల్లి బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు వారితో పాటు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ సీతా శ్రీనివాస్, వైస్ చైర్మన్ సూరేపల్లి రమేష్, డైరెక్టర్స్ సీత దామోదర్, భోగ విజయ్ కుమార్, చిక్క కృష్ణ, పున్న లక్ష్మీనారాయణ, కొండమడుగు ఎల్ల స్వామి, కడవేరు కవిత, పిల్లలమర్రి అర్చన. రాపోలు వేణు, సీఏ బిట్టు భాస్కర్, సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసూదన్, కొండమల్లేపల్లి బ్రాంచ్ మేనేజర్ పులిజాల సతీష్, ఇతర బ్రాంచ్ మేనేజర్స్ కడవేరు రాజు, సిటిఎస్ రెడ్డి, పార్ధు నాయక్, ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, చీదెళ్ల వెంకటేశ్వర్లు, పానుగంటి మల్లయ్య, వనపర్తి మురళి, సముద్రాల జ్ఞానేశ్వర్, దొడ్డి వెంకటేశ్వర్లు, దొడ్డి సుధాకర్, గాజుల ఆంజనేయులు, చీదెళ్ళ మనోజ్ కుమార్, పంపాటి శ్రీధర్, జితేందర్ యాదవ్, బొడ్డుపల్లి సైదులు, మంగ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love