– ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు ఆజాద్ , భారత బచావో నేషనల్ వైస్ చైర్మన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ ఏం ఎఫ్ గోపీనాథ్
నవతెలంగాణ హైదరాబాద్: ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లోని పొలిటికల్ సైన్స్ సెమినార్ హల్ లో భారత్ బచావో తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో 25, 26 న జరగబోయే ఆల్ ఇండియా స్టూడెంట్ కాన్ఫరెన్స్ సన్నాహక సమావేశం నిర్వహించారు , ఈ సందర్భంగా భారత బచావో నేషనల్ వైస్ చైర్మన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ ఏం ఎఫ్ గోపీనాథ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలకు సరైన నిధులు ఇవ్వకుండా సరిపడా ఫ్యాకల్టీ నియమించకుoడా విద్యార్థుల పై ఫీజుల భారాన్ని పెంచుతూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు, సైంటిఫిక్ తెంపర్ను పెంచాల్సిన విద్యను పూర్తిగా కషయికరిస్తు , రాజ్యాంగ విలువల్ని తుంగలోకి తొక్కుతుంది అని అన్నారు , ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ prof చింతా గణేష్ గారు మాట్లాడుతూ యూనివర్సిటీలో సరిపడా వసతులు కల్పించి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలని డిమాండ్ చేశారు , ఈ సందర్భంగా విద్యార్థులు , విద్యార్థి సంఘాల నాయకులు , మేధావులు, అందరూ ఈ నెల 24 , 25 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయాలని కోరారు , ఈ కార్యక్రమంలో భారత్ బచావో రాష్ట్ర నాయకులు ఒస్మానియా రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు ఆజాద్ , భారత్ బచావో రాష్ట్ర నాయకులు మహేష్ , శ్రావణ , గణేష్ , సనత్ జయసూర్య ,సూర్యుడు , AISF సత్య , SFI రవి నాయక్ ,PDSU శ్రీను , గిరిజన శక్తి హనుమంతు నాయక్ AMSA సైదులు DSA నాయకులు, బారి అశోక్ తదితరులు పాల్గొన్నారు