నవతెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆవిష్కరించారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్యామలదేవీ, నవతెలంగాణ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. అనంతరం జిల్లా అదనపు న్యాయమూర్తి డా.శివరాంప్రసాద్, పీసీఆర్ కోర్టు న్యాయమూర్తి దుర్గారాణి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, హుస్సేన్ లు అదనపు న్యాయమూర్తి నివాసం వద్ద నూతన క్యాలెండ్ ను, డైరీని లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ తిరుమల, నవతెలంగాణ రీజనల్ మేనేజర్ కె.నాందేవ్, డెస్క్ ఇంఛార్జి ఆర్.దత్తాత్రి, ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మెడపట్ల సురేష్, డివిజన్ ఇంఛార్జి ఉష్కం సురేష్, రిపోర్టర్లు గాజరి శ్రీకాంత్, రాజేశ్వర్, వంశీ పాల్గొన్నారు.