ఎన్‌హెచ్‌సీ ఫుడ్స్‌ రూ.47.42 కోట్ల రైట్‌ ఇష్యూ

న్యూఢిల్లీ : అహారోత్పత్తుల కంపెనీ ఎన్‌హెచ్‌సీ ఫుడ్స్‌ రూ.47.42 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం రైట్‌ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ తెరిచామని.. ఈ నెల 18తో ముగియనుందని ఆ కంపెనీ తెలిపింది. సుగంధ ద్రవ్యాలు, ఆహార ధాన్యాలు, నూనె గింజలు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్‌, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో సహా వివిధ రకాల ఆహార ఉత్పత్తుల ఎగుమతులను చేస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.2.76తో పోల్చితే అంతకంటే తక్కువకే లభిస్తుందని పేర్కొంది. ఇష్యూ ద్వారా వచ్చిన రూ.47.42 కోట్లలో రూ.25 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ.15 కోట్లను సెక్యూర్డ్‌ లోన్స్‌ రీపేమెంట్‌కు, రూ.7 కోట్లను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించాలని కంపెనీ భావిస్తోందన్నారు.

Spread the love