నవతెలంగాణ-బెజ్జంకి
సీపీఐ మండల నాయకుడు నిమ్మ ధర్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ సంతాపం వ్యక్తం చేశారు.మంగళవారం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన నిమ్మ ధర్మారెడ్డి మృత దేహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, మండల కార్యదర్శి బోనగిరి రూపేష్,ఏఐఎస్ఎఫ్ జిల్లాధ్యక్షులు సంగెం మధు సీపీఐ పార్టీ జెండా కప్పి పూలతో నివాళులర్పించారు. అనంతరం సీపీఐ నాయకులు,కార్యకర్తలు మృతుని అంత్యక్రియలలో పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్,ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్,జిల్లా అధ్యక్షులు సంగెo మధు, కరీంనగర్, సిద్దిపేట జిల్లా సీపీఐ కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి,బూడిద సదాశివ,ఎడల వనేశ్,గూడ పద్మ, అయిలేని సంజీవ రెడ్డి,బెజ్జంకి మండల సీపీఐ నాయకులు దొంతరవేని మహేష్, శ్రవణ్, రాకేష్, చరణ్, హరీష్, నర్సయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.